
రామచంద్రాపురం, వెలుగు: పటాన్చెరు నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి, కొత్త ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం అమీన్పూర్ మున్సిపాలిటీ రెండో వార్డులో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కొత్త కాలనీలలో మౌలిక సౌకర్యాలతో పాటు దేవాలయాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులతో వందల దేవాలయాలు నిర్మించామని, ఆలయాల అభివృద్ధి ఎల్లప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్, బాశెట్టి కృష్ణ, ప్రమోద్ రెడ్డి, గోపాల్, రుశ్వంత్ రెడ్డి, రాములు, దాసు, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. భారతీనగర్ జీహెచ్ఎంసీ డివిజన్ పరిధిలోని ఎంఐజీ కాలనీలో జరిగిన లలితా పోచమ్మ దేవాలయ బోనాల ఉత్సవాలలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపుడి గాంధీ పాల్గొన్నారు. కార్పొరేటర్ సింధు, బీఆర్ఎస్ కో ఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బోనాలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. బోనాల నిర్వహణకు అధిక నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.