కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్న విజయ్ కుమార్ : గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్న విజయ్ కుమార్ : గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు
  • పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​గౌడ్​ కు వినతి పత్రం ఇచ్చిన గజ్వేల్​ కాంగ్రెస్ నాయకులు 

గజ్వేల్, వెలుగు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను సోమవారం సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్​ నర్సారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్​ కాంగ్రెస్​ నాయకులు హైదరాబాద్ లోని​ గాంధీభవన్​లో కలిశారు. భూకబ్జాలు, అక్రమాలు, అవినీతి, కులం పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న విజయ్ కుమార్ ను పార్టీ సభ్యత్వం నుంచి తొలగించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.

బీఆర్​ఎస్​, బీజేపీ నేతలతో అంటకాగుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విజయ్​కుమార్​ పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆగస్టు 15న డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి సిద్దిపేటలో పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరిస్తున్న సందర్భంలో కొంతమందిని రెచ్చగొట్టి కార్యాలయంపై దాడికి ప్రయత్నించడంతో పాటు ఆయన కాన్వాయిపై దాడి చేయించడం, దిష్టిబొమ్మలు తగలబెట్టించాడని వివరించారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ మోహన్, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, పరశురాం, ప్రభాకర్ గుప్త, నాచగిరి ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ గుప్తా, నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కృష్ణ,  ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.