ఆగస్టు 22న తెలంగాణ బంద్ .. మార్వాడీల దాడికి నిరసనగా ఓయూ జేఏసీ పిలుపు

ఆగస్టు  22న తెలంగాణ బంద్ .. మార్వాడీల దాడికి నిరసనగా ఓయూ జేఏసీ పిలుపు

ఓయూ, వెలుగు: మోండా మార్కెట్ లో ఓ దళితుడిపై మార్వాడీలు చేసిన దాడిని ఖండిస్తూ ఈ నెల 22న తెలంగాణ బంద్​కు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ప్రకటించారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద మార్వాడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. రాజస్థాన్, గుజరాతీ మార్వాడీలు ఇక్కడికి వలస వచ్చి తెలంగాణ కుల వృత్తులను దెబ్బతీస్తున్నారన్నారు. ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే.. ఇప్పుడు మార్వాడీలు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో దరువు రమేశ్, రమేశ్, రాజేందర్, శివాజీ, చరణ్, అరుణ్, కుమార్, జలంధర్ పాల్గొన్నారు.