యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు కలెక్టర్ సంతోష్

యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు కలెక్టర్  సంతోష్

గద్వాల, వెలుగు: జిల్లాలో యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని గద్వాల కలెక్టర్  సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని సీఐఎల్  ప్రైవేట్  లిమిటెడ్  యూరియా గోడౌన్ ను తనిఖీ చేశారు. యూరియా నిల్వలను  పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యూరియా నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

 నిల్వ ఉన్న ఎరువులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంపిణీ చేయాలని సూచించారు. యూరియా స్టాక్ ను ప్రభుత్వ డిస్ట్రిబ్యూషన్  సెంటర్లతో పాటు ప్రైవేట్​ డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. డీఏవో సక్రియా నాయక్, సంగీతలక్ష్మి, ఏవో ప్రతాప్  ఉన్నారు.

‘డబుల్’ ఇండ్లను ఓపెనింగ్ కు రెడీ చేయాలి

డబుల్​ బెడ్రూం ఇండ్లను ఓపెనింగ్​కు రెడీ చేయాలని కలెక్టర్​ సంతోష్​ ఆదేశించారు. తన ఛాంబర్ లో సంబంధిత ఆఫీసర్లతో ‘డబుల్’ ఇండ్ల పెండింగ్ పనులపై రివ్యూ చేశారు. సెప్టెంబర్  మొదటి వారంలో ఇండ్ల ప్రారంభోత్సవం చేసేలా పనులన్నీ వారం రోజుల్లో కంప్లీట్  చేసి, సౌలతులు కల్పించాలన్నారు. 

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మరోసారి పరిశీలించి శాంక్షన్​ లెటర్లను సిద్ధం చేయాలని సూచించారు. అడిషనల్  కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, పీడీ శ్రీనివాసరావు, డీఈ కాశీనాథ్, పీఆర్  ఈఈ దామోదర్, విద్యుత్  శాఖ డీఈ తిరుమలరావు, మున్సిపల్  కమిషనర్  దశరథం ఉన్నారు