పేదలకు కార్పొరేట్ వైద్యం అందాలి : మంత్రి దామోదర

పేదలకు కార్పొరేట్ వైద్యం అందాలి : మంత్రి దామోదర
  • ఉగాది కల్లా టిమ్స్ రెడీ కావాలి: మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: ఉగాది పండుగ నాటికి సనత్‌‌ నగర్ టిమ్స్ హాస్పిటల్ సకల సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి రావాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మంగళవారం సనత్‌‌నగర్ టిమ్స్ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో హైలెవల్ రివ్యూ నిర్వహించారు. 

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనులు స్పీడప్ చేయాలని సూచించారు. హాస్పిటల్‌‌ కు నీళ్లు, కరెంట్ 24 గంటల సరఫరా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడొద్దన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి, వాటర్ బోర్డు జేఎండీ మయాంక్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.