ఆగస్టులో 18 ఏళ్ల లోపు వారికి కరోనా వ్యాక్సిన్

ఆగస్టులో 18 ఏళ్ల లోపు వారికి కరోనా వ్యాక్సిన్

వచ్చే నెల నుంచి దేశంలోని 18 ఏళ్ల లోపు వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ ఎంపీలకు ఈ విషయాన్ని ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ వివరించారు. అలాగే మరిన్ని కంపెనీలకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు లైసెన్స్ కూడా ఇవ్వనున్నట్టు చెప్పారు. దీని ద్వారా ఇండియా త్వరలోనే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా మారనుందని మాండవీయ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ నుంచి జైడస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. జైడస్ వ్యాక్సిన్ ను 12 నుంచి 18 ఏళ్ల లోపు వారిపై ప్రయోగాలు కూడా జరిపారు. వాటి ఫలితాలను DCGI ఎక్స్ పర్ట్స్ కమిటీ ఇంకా అధ్యయనం చేస్తోంది. అయితే ఆగస్ట్ లోనే 18 ఏళ్ల లోపువారికి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయాలని ప్రభుత్వం అనుకోవడంతో... ఆగస్ట్ లోనే జైడస్ కు పర్మిషన్ ఇస్తారా..? లేదా ఫారిన్ వ్యాక్సిన్లను దించుతారా..? అనేది తెలియాల్సి ఉంది.