హెల్త్​కు ఫండ్స్​ పెరిగినయ్​..  వైద్య ఆరోగ్య శాఖకు రూ.90 వేల కోట్లు

హెల్త్​కు ఫండ్స్​ పెరిగినయ్​..  వైద్య ఆరోగ్య శాఖకు రూ.90 వేల కోట్లు
  • గతేడాదితో పోలిస్తే 12% అధికం
  • కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం
  • ఆయుష్ మినిస్ట్రీ కోసం 3,712 కోట్లు
  • ఆశా, అంగన్​వాడీ వర్కర్స్​కు ఆయుష్మాన్ భారత్ వర్తింపు

న్యూఢిల్లీ: 2024 – 25 ఫైనాన్షియల్ ఇయర్​కు సంబంధించిన మధ్యంతర బడ్జెట్​లో వైద్య ఆరోగ్య శాఖకు రూ.90,658 కోట్లు కేటాయించారు. 2023 – 24 ఫైనాన్షియల్ బడ్జెట్ కంటే 12.59 శాతం ఎక్కువ నిధులు కేటాయించారు. పోయిన ఏడాది రూ.80,517 కోట్లు వైద్య ఆరోగ్య శాఖకు అలాట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ స్కీమ్​ను ఆశా, అంగన్​వాడీ వర్కర్స్, హెల్పర్స్​కు వర్తింపజేస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్టు వివరించారు. హాస్పిటల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ మరింత డెవలప్ చేస్తామని తెలిపారు. దీని కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా ఆమె ప్రకటించారు. కమిటీ రిపోర్టు, రికమండేషన్స్ ఆధారంగా వైద్య ఆరోగ్య శాఖ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

తాజాగా కేటాయించిన రూ.90,658 కోట్ల నుంచి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్​కు రూ.87,656 కోట్లు అలాట్ చేసిందిన. హెల్త్ రీసెర్చ్ డిపార్ట్​మెంట్​కు రూ.3,001 కోట్లు కేటాయించింది. ఆయుష్ మినిస్ట్రీ కోసం రూ.3,712 కోట్లు కేటాయించింది. గతంలో రూ.3వేల కోట్లు అలాట్ చేసింది. 2022–23తో పోలిస్తే 23.74 శాతం కేటాయింపులు పెంచింది.  వైద్యులుగా ప్రజలకు సేవ చేయాలని చాలామంది యువత ఆశ పడుతున్నట్టు తెలిపింది. 

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్

9 నుంచి 14 ఏండ్ల బాలికల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ (‘సర్వైకల్‌‌‌‌‌‌‌‌ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌) నివారణకు చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెడ్తామన్నారు. ‘‘ప్రపంచ మహిళా జనాభాలో 16 శాతం మంది ఇండియాలోనే ఉన్నారు. సర్వైకల్‌‌‌‌‌‌‌‌ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ బారిన పడుతున్న ప్రతి నలుగురిలో ఒకరు మన దేశానికి చెందినవారే. ఈ వ్యాధి కారణంగా చనిపోతున్న వారిలో మూడో వంతు మంది మన మహిళలే ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం.. ఏటా దేశంలో 80 వేల మంది సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. 35 వేల మంది ఈ వ్యాధి కారణంగా చనిపోతునట్టు తేలింది’’అని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

దేశవ్యాప్తంగా ‘యూ విన్’ ప్లాట్​ఫామ్ 

కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసే స్కీమ్స్​కు గత ఆర్థిక సంవత్సరం (రూ.77,624 కోట్లు)తో పోలిస్తే.. ఈ సారి రూ.87,656 కోట్లకు పెంచినట్టు వివరించారు. ‘‘పిల్లల్లో రోగ నిరోధకత పెంచడం కోసం తీసుకొచ్చిన ‘మిషన్ ఇంద్ర ధనుస్సు’ను నిర్వహించేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన ‘యూ విన్‌‌‌‌‌‌‌‌’ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తాం. మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కోసం అమలు చేస్తున్న పథకాలను సమగ్ర ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ కిందకు తీసుకొస్తాం. సాక్షమ్‌‌‌‌‌‌‌‌ అంగన్​వాడీ స్కీమ్ కింద అంగన్​వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తాం. చిన్నారుల ఎదుగుదల కోసం పోషకాహార పంపిణీని మెరుగ్గా అందించేందుకు పోషణ్‌‌‌‌‌‌‌‌ 2.0 కార్యక్రమాన్ని అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌ చేస్తాం’’అని నిర్మల ప్రకటించారు.