వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా వస్తుంటాయి

వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా వస్తుంటాయి

వయసు అనేది ఒక అంకె మాత్రమే. కాకపోతే  ఆ అంకెలు మారే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా వస్తుంటాయి. అందుకనే ఏదైనా డిజార్డర్​కి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే  అలర్ట్​ కావాలి. లేదంటే ఆ  సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముప్ఫయేండ్లు ఉన్న ఆడవాళ్లు ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచాలి అంటోంది ఆయుర్వేద ఎక్స్​పర్ట్​ నితికా కోహ్లి. అంతేకాదు ఏ విషయాలను గమనించాలో కూడా చెప్పిందామె. 

ఎంత ప్రయత్నించినా కూడా బరువు తగ్గడం లేదా? అయితే మెటబాలిజంలో మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. అప్పుడు డాక్టర్​ని కలిసి మెటబాలిజం సరిగా జరగడానికి ఏం చేయాలో తెలుసుకోవాలి.  నూనె పట్టించడం, షాంపూ వాడడం, చిక్కులు లేకుండా తల దువ్వుకోవడం... వంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొందరికి జుట్టు ఊడిపోతుంది. అందుకు సరైన  పోషకాలు సరిపోను అందకపోవడమే కారణం. అందుకని జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన న్యూట్రియెంట్స్​ ఉన్న ఫుడ్ తినాలి.   

పీరియడ్​ టైమ్​కి రాకపోడం, ఏ కారణం లేకుండానే వెజైనల్​ బ్లీడింగ్ వంటివి ఇబ్బంది పెడతాయి. తరచూ అలా జరుగుతుంటే వెంటనే గైనకాలజిస్ట్​ని కలవాలి. ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తే పల్మొనాలజిస్ట్​ని కలిసి టెస్ట్​ చేయించుకోవాలి. ఆస్తమాతో పాటు ఇతర శ్వాస సంబంధిత సమస్య ఉన్నదేమో నిర్ధారించుకోవాలి. స్కిన్ ఇన్ఫెక్షన్​ వల్ల చర్మం రంగు మారడం, మచ్చలు ఏర్పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.  అందుకని డెర్మటాలజిస్ట్​ని కలిసి అవి ఏ రకం ఇన్ఫెక్షన్లు అనేది తెలుసుకుని ట్రీట్మెంట్ చేయించుకోవాలి.