రక్తం లెవల్స్ పెంచేందుకు తాగాల్సిన జ్యూస్లు ఇవే

రక్తం లెవల్స్ పెంచేందుకు తాగాల్సిన జ్యూస్లు ఇవే

హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ ను తీసుకువెళ్లే ఎర్రరక్తకణాలలో ఉండే ఐరన్ తో కూడాని మెటాలోప్రోటీన్. తక్కువ హీమోగ్లోబిన్ కారణంగా రక్తహీనత వస్తుంది. ఇది మిమ్మల్ని అలసిపోయినట్టుగా, బలహీనంగా ఉన్న భావనను తెప్పిస్తుంది. అందుకు ఈ కింది పానీయాలను సేవిస్తే హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచవచ్చు.

దుంపల రసం

 

ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది..

ఆకుకూర స్మూతీ

పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, సి అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచేందుకు సహకరిస్తాయి.

దానిమ్మ రసం

ఐరన్, విటమిన్ సి అధికంగా ఉండే దానిమ్మ రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కూడా ఆరోగ్యాన్ని మెరుగుపర్చే హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.

ఆల్బుకార రసం

 

సీజన్ లో దొరికే ఈ పండ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇందులో ఐరన్ తో పాటు పొటాషియం కూడా ఉంటుంది.