దానం అనర్హత పిటిషన్ పై విచారణ 2 కు వాయిదా

దానం అనర్హత పిటిషన్ పై విచారణ 2 కు వాయిదా

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై వాదనలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వచ్చే నెల 2 కు వాయిదా వేశారు. శుక్రవారం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో జరిగిన విచారణకు దానం తరఫు అడ్వకేట్లు, ఆయనపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తరఫు అడ్వకేట్లు హాజరయ్యారు. గడువు ఇవ్వాలని దానం కోరడంతో విచారణను మార్చి 2కు వాయిదా పడింది.