ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితులకు బెయిల్‌ ఇవొద్దన్న పోలీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు..   నిందితులకు బెయిల్‌ ఇవొద్దన్న పోలీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరిగింది.   కేసులో నిందితులుగా ఉన్న రాధా కిషన్ రావు, భుజంగ రావు, తిరుపతన్న, ప్రణీత్ రావు బెయిల్‌ పిటిషన్‌లలో పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. కేసు విచారణ జరుగుతుందని, బెయిల్ ఇస్తే నిందితులు సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు కోర్టును కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణ ఈ నెల 24 కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు.