వచ్చేస్తున్నాయ్..​ వేడి గాలులు

వచ్చేస్తున్నాయ్..​ వేడి గాలులు

మే తొలి వారం నుంచే ప్రభావం
జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకీ ఎండల తీవ్రత ఎక్కువవుతోంది. వచ్చే కొన్ని రోజుల్లో వేడి గాలుల తీవ్రతతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్టోగ్రత స్థాయి మరింత పెరగనుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. మే మొదటి వారం నుంచి వేడి గాలుల వ్యాప్తి ఎక్కువయ్యే చాన్సెస్ ఉన్నాయి. ఆ టైమ్ లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు రికార్డవుతాయి. 47 డిగ్రీలను మించి ఉష్టోగ్రత నమోదైతే దాన్ని తీవ్రమైన వేడి గాలులుగా భావించాలని సైంటిస్టులు చెబుతున్నారు. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండల్లో వేడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. గతేడాది 44 రోజులపాటు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈసారీ వేడి గాలులు ప్రభావం చూపుతాయని, వడ దెబ్బల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

భద్రాచలంలో హయ్యస్ట్ టెంపరేచర్ వేడి గాలులు నిశ్శబ్ద అలల లాంటివి అని, వాటి ప్రభావాన్ని అంచనా వేయడం కష్టమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో హయ్యస్ట్ టెంపరేచర్ విషయానికొస్తే.. అత్యధికంగా1973లో భద్రాచలంలో 48.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అలాగే హైదరాబాద్ లో 1966లో 45.5 డిగ్రీల సెల్సియస్ రికార్డ్​ అయింది.