
ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. డిసెంబర్ 15 ఉదయం నుంచే జనం క్యూ కట్టారు. దీంతో బేగంపేటలోని ప్రజాభవన్ నుంచి పంజాగుట్ట చౌరస్తా వరకు క్యూ లైన్లో ఉన్నారు ప్రజలు. జనం రోడ్లపై నిల్చోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో సమస్యలు చెప్పుకునేందుకు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు. కొందరు రాత్రి నుంచే ఎదరుచూస్తున్నారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం1గంటల వరకు ప్రజావాణి జరగనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చా ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజాభవన్ గా మార్చిన సంగతి తెలిసిందే. జనం సమస్యలు తెలుసుకునేందుకు సీఎం రేవంత్ తొలిసారి ప్రజాదర్బార్ కూడా నిర్వహించారు. జనం భారీగా తరలివచ్చారు. వేలాది మంది ఫిర్యాదుల కోసం వచ్చారు.
ప్రజాదర్భార్ ను ప్రజావాణిగా పేరు మార్చింది ప్రభుత్వం. అంతేగాకుండా ప్రతీ మంగళవారం, శుక్రవారం ప్రజావాణి జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫిర్యాదులు తీసుకోనున్నారు. ఉదయం 10 గంటల వరకు లైన్లో ఉన్నవారికే అనుమతిస్తారు. దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.