శ్రీశైలం 7 గేట్లు ఎత్తివేత..పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

శ్రీశైలం 7 గేట్లు ఎత్తివేత..పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం 7గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. క్రస్ట్ గేట్లు, పవర్ జనరేషన్, ఎత్తిపోతలు కలిపి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం రిజర్వాయరు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 883.50 అడుగులుగా ఉంది. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలుకాగా ప్రస్తుతం నీటి నిల్వ 207 టీఎంసీలుగా ఉంది.