శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో  భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.18 లక్షల విలువ చేసే 350 గ్రాముల బంగారాన్ని గర్తించారు కస్టమ్స్ అధికారులు.  కస్టమ్స్ అధికారులను బురిడి కొట్టించడానికి బంగారాన్ని తూకం వేసే పరికరాల్లో దాచి తీసుకొచ్చాడు. ఎయిర్ పోర్ట్ లో అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో అడ్డంగా దొరికి పోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు  కస్టమ్స్ అధికారులు.