
ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం (జూలై13) సాయంత్రం కురిసిన వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీలో వివిధ ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. అయితే ఆదివారం కావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తలేదు. రానున్న కొన్ని గంటల్లో ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కర్తవ్యపథ్, ప్రగతి మైదాన్, సఫర్ గంజ్, పుసా, మెహరాలి, గురుగ్రావ్, నారాయణ, జనక్ పురి ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతాల్లో వీధులు, రోడ్లన్నీ జలమయమయ్యాయి.
సోహానా, పాల్వాల్, నుహ్‌లలో ఉరుములు, మెరుపులతో 30నుంచి -40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. హర్యానా తూర్పు ప్రాంతాలు , పశ్చిమ యూపీలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పలు విమానాల రాకపోకలను రీషెడ్యూల్ చేశారు. ఇండిగో విమాన ఆలస్యంగా నడుస్తాయని ప్రయాణికులకు తెలిపింది.
ఆదివారం ఉదయం ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. గడిచిన రెండు రోజులనుంచి ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచిభారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.