
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో మంగళవారం సాయంత్రం మళ్లీ వర్షం దంచికొట్టింది. రోడ్లపైకి వరద చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 5.13, చందానగర్‌లో 4.48, హెచ్‌సీయూ 4.03, ఆర్సీపురం 3.65, హఫీజ్ పేట 3.03, ఎంసీహెచ్ఆర్డీ 2.60, గచ్చిబౌలిలో 2.43 సెం.మీ. వాన పడింది. మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.
జూబ్లీహిల్స్ /కూకట్పల్లి: సోమవారం వర్షానికి ఫతేనగర్ పరిధిలోని అమృతనగర్ తండాలో 60 ఇండ్లు ముంపునకు గురయ్యాయి. తాత్కాలికంగా కేపీహెచ్‌బీకాలనీ నాలుగో ఫేజ్‌లోని కమ్యూనిటీహాల్లో బాధితులకు పునరావాసం కల్పించారు. మరోవైపు జూబ్లీహిల్స్ నుంచి వరద కృష్ణానగర్, ఇందిరానగర్, వెంకటగిరి ప్రాంతాలకు వస్తుండడంతో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు మ్యాన్‌హోల్ మూతలు తెరిచి వరదను బయటకు పంపే ప్రయత్నాలు
చేస్తున్నారు.