
Term Insurance: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ప్రస్తుతం ఇండియాలోని ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి టర్మ్ ప్లాన్స్ కొంటున్న ట్రెండ్ ఒక్కసారిగా ఊపందుకుంది. ప్రధానంగా అమెరికా, యూఏఈ, సింగపూర్ వంటి దేశాల్లోని ఇన్సూరెన్స్ ప్రీమియంల కంటే ఇండియాలో రేట్లు 50 శాతం వరకు తక్కువగా ఉండటంతో ఎన్ఆర్ఐలు తమ ఫ్యామిలీస్ కోసం సొంత దేశంలో ఇన్సూరెన్స్ ప్లాన్స్ కొంటున్నారు.
దేశంలోని కంపెనీలు ఎక్కువ కవరేజీని అందిచటంతో పాటు ఇండియాలోని ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుల ఖాతాల్లో డబ్బును రూపాయిల్లో జమచేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ వారు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారనే విషయాన్ని, వారు మరణించే ప్రదేశాన్ని కంపెనీలు పరిగణలోకి తీసుకోకపోవటాన్ని ఎన్ఆర్ఐలు వినియోగించుకుంటున్నారు.
ALSO READ : సూపర్ రిచ్ వాడే 4 ప్రత్యేక క్రెడిట్ కార్డ్స్ గురించి మీకు తెలుసా..?
ఇండియాలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కొంటున్న ఎన్ఆర్ఐలకు లభించే బెనిఫిట్స్ ఇవే..
1. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్. ఒక 30 ఏళ్ల వ్యక్తి విదేశంలో ఇన్సూరెన్స్ కొనటం కంటే ఇండియాలో 50 శాతం వరకు గరిష్ఠంగా ప్రీమియం చెల్లింపులపై పొదుపు చేసుకోవచ్చు.
2. ఇన్సూరెన్స్ కంపెనీలు వారికి రూపాయిల రూపంలో పేమెంట్ చేయటం వల్ల మళ్లీ ఆ డబ్బును ఫ్యామిలీ కన్వర్ట్ చేసుకోనక్కర్లేదు. ఇది కరెన్సీ విలువ మార్పుల నుంచి ఉపశమనం అందిస్తుంది. విదేశాల్లో మరణించినా పాలసీదారుడి చుట్టాలకు ఇండియాలో ఇన్సూరెన్స్ కంపెనీలు పేమెంట్ ప్రాసెసింగ్ ఒక ప్రయోజనం.
3. పాలసీ తీసుకునే ఎన్ఆర్ఐలు తమ పాస్ పోర్ట్, ఇతర దేశంలోని అడ్రస్ ప్రూఫ్, ఆదాయం రుజువు, ఫోటోలు వంటి వివరాలు ఇస్తే చాలు. అలాగే ఎన్ఆర్ఐ ఖాతా ఓపెన్ చేసి రూపాయిల్లో పేమెంట్ చేయెుచ్చు.
4. ఎన్ఆర్ఐలు ప్రూర్ టర్మ్ ప్లాన్స్ ఎంచుకుని తమ సంపాదన వయస్సును మాత్రమే చూపాలి. సహజంగా 65-70 ఏళ్ల వరకు వార్షిక ఆదాయంపై 10 రెట్ల వరకు కవరేజ్ పొందొచ్చు. సంపన్న ఎన్ఆర్ఐలు గరిష్టంగా 7 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు కవరేజ్ పొందటానికి వీలు ఉంటుంది. ఇది వారి ఆస్తులు, సంపాదన వంటి అనేక అంశాలపై అదారపడి మారుతుంటుంది.