సూపర్ రిచ్ వాడే 4 ప్రత్యేక క్రెడిట్ కార్డ్స్ గురించి మీకు తెలుసా..?

సూపర్ రిచ్ వాడే 4 ప్రత్యేక క్రెడిట్ కార్డ్స్ గురించి మీకు తెలుసా..?

ప్రపంచంలో అత్యంత సంపన్నుల కోసం బ్యాంకులు అందిస్తున్న కొన్ని స్పెషల్ క్రెడిట్ కార్డ్స్ గురించి మనలో చాలా మందికి తెలియవు. అసలు క్రెడిట్ కార్డ్‌లు కేవలం డబ్బు చెల్లించేందుకు సౌకర్యాన్ని మాత్రమే కల్పించటంతో పాటు.. సాధారణంగా వినియోగదారులకు అందని రివార్డులు, ప్రయోజనాలు, ప్రత్యేక సేవలు వీటిలో ఉంటుంటాయి. పైగా సూపర్ రిచ్, సెలబ్రిటీలు ఈ కార్డులు ఉండటాన్ని ఒక హోదాగా లేదా గుర్తింపుగా కూడా భావిస్తుంటారు. రిట్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసే కార్డుల్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలో గుర్తింపు పొందిన అత్యంత అల్ట్రా ప్రీమియం క్రెడిట్ కార్డుల్లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచురియన్ బ్లాక్ కార్డ్, జేపీ మార్గన్ రిజర్వ్, దుబాయ్ ఫస్ట్ రాయల్ మాస్టర్‌కార్డ్,  కౌట్స్ వరల్డ్ సిల్క్ కార్డ్ ఉన్నాయి. వీటిలో Amex Black Card అత్యంత గుర్తింపు పొందింది. దీనిని తీసుకోవటానికి ప్రారంభ ఫీజు 10వేల డాలర్లు అంటే రూ.8 లక్షలకు పైనే కాగా వార్షిక ఫీజు దాదాపు రూ.4లక్షల 50వేలుగా ఉంది. ఈ కార్డ్ ద్వారా ప్రయాణ ఏర్పాట్లు, రెస్టారెంట్ బుకింగ్స్, ఇతర పర్సనల్ సహాయాలు కూడా అందించబడుతున్నాయి.

ALSO READ : మైక్రోసాఫ్ట్ ఆఫీసులో డెత్ మిస్టరీ

ఇక కౌట్స్ వరల్డ్ సిల్క్ కార్డ్ బ్రిటీష్ కి చెందిన ప్రముఖ బ్యాంకింగ్ క్లయింట్ల కోసం రూపొందించబడింది. ఈ కార్డ్ కస్టమర్లకు రివార్డులు, కుటుంబ సభ్యులకు యాడాన్ కార్డ్స్ ఇచ్చే సౌకర్యం కలిగి ఉంది. ప్రధానంగా ఇలాంటి ఎలైట్ కార్డులు ఎక్కువ ఖర్చు చేసేందుకు పరిమితిని కలిగి సంపన్న వ్యాపారవేత్తలు వారి కుటుంబాల కోసం డిజైన్ చేస్తుంటారు. ఈ కార్డుల రివార్డ్స్, ఫెసిలిటీలు కూడా రిచ్ లైఫ్ స్టైల్ కలిగిన క్లయింట్లకు అనుగుణంగా ఉండేలా చూస్తుంటాయి బ్యాంకింగ్ సంస్థలు. 

వాస్తవానికి ఇలాంటి కార్డులు సాధారణ కస్టమర్లకు కాకుండా ప్రత్యేక పరిస్థితులు, అవసరాలు  కలిగిన సంపన్న వర్గాలను టార్గెట్ చేసి డిజైన్ చేస్తుంటారు ప్రత్యేకంగా. సంపన్నులు తమ ఆర్థిక వ్యవహారాలను మరింత సమర్థవంతంగా, సులువుగా నిర్వహించుకోవటానికి ఇలాంటి ప్రత్యేక కార్డులను ఇష్టపడుతుంటారు.