
Microsoft: అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సిలికాన్ వ్యాలీ ఆఫీసులో షాకింగ్ ఇన్సిడెంట్ బయటపడింది. 35 ఏళ్ల భారత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రతీక్ పాండే చనిపోయిన స్థితిలో ఉన్నట్లు బుధవారం గుర్తించారు. అయితే అసలు పాండే ఎలా మరణించారనే విషయం ఇంకా తెలియలేదు. మరణించిన ప్రతీక్ పాండే ఎక్కువ సార్లు రాత్రిపూట ఆలస్యంగా పనిచేస్తూ ఆఫీసులోనే అధిక సమయం ఉంటారని ఫ్యామిలీ చెబుతోంది. వాస్తవానికి ఆగస్టు 19న పాండే ఎప్పటి లాగానే ఆఫీసుకు వచ్చారని అయితే తర్వాతి రోజు ఉదయం మరణించిన స్థితిలో గుర్తించినట్లు ఆఫీసు వర్గాలు చెబుతున్నాయి.
మైక్రోసాఫ్ట్ ఉద్యోగి మరణానికి గల కారణం ఇంకా నిర్ధారించబడలేదని శాంటా క్లారా కౌంటీ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. అయితే టెక్కీ మ-ృతి గురించి వార్త తెలియగానే తెల్లవారుజామున అక్కడికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అనుమానాస్పద వాతావరణం ఆఫీసులో కనిపించలేదని చెప్పారు. దీనిపై దర్యాప్తు స్టార్ట్ చేసినట్లు మౌంటెన్ వ్యూ పోలీసులు చెప్పారు.
అసలు ప్రతీక్ పాండే మైక్రోసాఫ్ట్ లో ఏం చేస్తారు..?
2020లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లో చేశారు ప్రతీక్ పాండే. దీనికి ముందు ఆయన అమెరికాలోని అతిపెద్ద రిటైల్ జైంట్ వాల్‌మార్ట్, ఐఫోన్ మేకర్ ఆపిల్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కంపెనీలో డేటా అనాలసిస్ కోసం ఉపయోగించే ఫాబ్రిక్ ఉత్పత్తిపై పనిచేస్తున్నారు. దీనిని డేటా అనాలసిస్ కోసం దిగ్గజ సంస్థలు వినియోగిస్తుంటాయి. ప్రతీక్ మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.
►ALSO READ | గుండె జబ్బుల డాక్టర్.. ఆస్పత్రిలో పేషెంట్లను చూస్తూ.. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయాడు
మధ్యప్రదేశ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతీక్ ఆ తర్వాత అమెరికాలోని వర్సిటీల్లో రెండు మాస్టర్ డిగ్రీలు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు ప్రస్తుతం ఆయన మృతిపై దర్యాప్తు చేస్తూ క్రిమినల్ కేసు కాదని చెబుతున్నారు.