Mowgli Glimpse : నాని వాయిస్ ఓవర్‌తో 'మోగ్లీ' గ్లింప్స్ రిలీజ్.. రోషన్ కనకాల యాక్షన్ అదుర్స్!

Mowgli Glimpse : నాని వాయిస్ ఓవర్‌తో 'మోగ్లీ' గ్లింప్స్ రిలీజ్..  రోషన్ కనకాల యాక్షన్ అదుర్స్!

"ఓ 25 ఏళ్ల కుర్రాడు 30 మందిని తిండి, నిద్ర లేకుండా పరిగెత్తించాడు. వాడు గ్యాంగ్‌స్టర్ కాదు, క్రిమినల్ కాదు... మరి వాడెవరు? వాడి కథ ఏంటి?" - ఈ ప్రశ్నతో 'మోగ్లీ' సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు హీరో నాని. రాజీవ్ కనకాల, సుమ దంపతుల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న ఈ సినిమా 'మోగ్లీ'. దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నాని వాయిస్ ఓవర్‌తో 'మోగ్లీ' గ్లింప్స్
'మోగ్లీ' గ్లింప్స్‌ను హీరో నాని తన వాయిస్ ఓవర్‌తో మరింత ఆకర్షణీయంగా మార్చారు. "ఒక చిన్న ప్రేమ కథ కోసం జరిగిన ఒక పెద్ద యుద్ధం" అని గ్లింప్స్‌ను ముగించి సినిమా కథపై ఉత్సుకతను పెంచారు. ఈ గ్లింప్స్‌లో రోషన్ స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. ఇదొక యాక్షన్, లవ్ ఎంటర్‌టైనర్ అని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. సాక్షి సాగర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది.

►ALSO READ | రామ్ చరణ్ మూవీపై కమలినీ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు.. టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి అసలు కారణం ఇదే!

'మోగ్లీ' గ్లింప్స్ మొత్తం ఓ సరికొత్త ప్రపంచాన్ని చూపించింది. రోషన్ కనకాల లుక్, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. నాని వాయిస్ ఓవర్‌తో వచ్చిన గ్లింప్స్‌కు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాతో రోషన్ హీరోగా నిలబడతారనే నమ్మకం వ్యక్త చేస్తున్నారు అభిమానులు. సినిమా విడుదల తేదీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.