
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం (94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో శనివారం (ఆగస్ట్ 30) తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం కోకాపేటలో అల్లు కనకరత్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. నానమ్మ చనిపోయినా విషయం తెలియగానే ముంబైలో సినిమా షూటింగ్ పనుల్లో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు. అల్లు అరవింద్ తల్లి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.