
మహిళా విస్తరణ అధికారి (AEO) ని వేధింపులకు గురిచేసిన అగ్రికల్చర్ ఆఫీసర్ సస్పెండ్ చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి (AO) బాలకృష్ణ.. తన కింద పని చేసే ఏఈవో తో ఫోన్ లో అసభ్యంగా ప్రవర్తించాడు.
సదరు అధికారి తనపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. వేధింపులకు గురిచేస్తున్నాడని కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఫోన్ రికార్డింగ్స్, ఇతర ఆధారాలతో జిల్లా కలెక్టర్ దృష్టితి తీసుకెళ్లింది.
విచారించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. వేధింపులకు పాల్పడుతున్న వ్యవసాయ అధికారి బాలకృష్ణను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా ఉద్యోగుల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.