నిజామాబాద్ జిల్లాలో భారీవర్షం..ఆర్మూర్లో గుట్టపైనుంచి ఇంటిపై పడ్డ బండరాయి.. కూలిన గోడ

నిజామాబాద్ జిల్లాలో భారీవర్షం..ఆర్మూర్లో గుట్టపైనుంచి ఇంటిపై పడ్డ బండరాయి.. కూలిన గోడ

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు నిజామాబాద్ జిల్లాలో బీభత్సం సృష్టించాయి. కేవలం 48 గంటల్లో కనీవినీ ఎరుగని రీతిలో వర్షపాతం నమోదు అయింది. రోడ్లు, ఇండ్లు ధ్వంసమయ్యాయి. వరదలతో ప్రజలు విలవిలాడిపోయారు. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పోటెత్తాయి. వరద ప్రవాహానికి రహదారులు కొట్టుకుపోయాయి. పంటలు దెబ్బతిన్నాయి.ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం(ఆగస్టు29) కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. వర్షాలకుఆర్మూర్ మునిపల్ పరిధిలో  పలువురి ఇండ్లు దెబ్బతిన్నాయి.  కమలా నెహ్రూ కాలనీలో వర్షానికి గుట్టపై నుంచి బండరాయి దొర్లుకుంటూ వెళ్లి ఓ ఇంటిపై పడింది. దీంతో ఇంటిగోడ ధ్వంసమైంది.  ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. 

ఇంటి గోడ ధ్వంసం కావడంతో తమకు నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.