
మంచిర్యాల: మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్‌కు రైల్వే గ్రీన్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక నుంచి మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ ఆగనుంది. దాదాపు సంవత్సరం నుంచి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్, రైల్వే బోర్డ్ చైర్మన్లను కలిసి మంచిర్యాలకి వందే భారత్ హాల్టింగ్ ఇవ్వాలని కాంగ్రెస్ యువ నాయకుడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి చేస్తున్నారు.
అవకాశం వచ్చినా ప్రతిసారి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చివరకు ఎంపీ వంశీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అధికారులు.. మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక నుంచి మంచిర్యాల రైల్వేస్టేషన్లో వందే భారత్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఎంపీ వంశీకృష్ణ కృషితో ఎట్టకేలకు మంచిర్యాల రైల్వే ప్రయాణికుల కష్టాలకు చెక్ పడింది. మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్‌కు హాల్టింగ్ ఇవ్వడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వంశీ పోరాటాన్ని అభినందించారు.
ALSO READ : మాగంటి గోపీనాథ్ క్లాస్ గా కనిపించే మాస్ లీడర్
ఎంపీ వంశీ మాట్లాడుతూ.. మంచిర్యాలలో త్వరలోనే వందే భారత్ ట్రైన్ ఆగుతుందని తెలిపారు. సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ ఉంటుందని చెప్పారు. ఏడాదిన్నరగా చేస్తున్న కృషితోనే కేంద్ర ఓకే చెప్పిందని అన్నారు. మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్పై పలుసార్లు కేంద్ర మంత్రిని కలిసినట్లు గుర్తు చేశారు ఎంపీ వంశీ.