హైదరాబాద్‌సిటీ, వెలుగు: తెలంగాణలో ఫిజిక్స్ టీచర్లకు సపోర్టుగా ఫిజిక్స్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్టు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.జహంగీర్ ప్రకటించారు. 2020లో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న ఫిజిక్స్ లెక్చరర్లు ఈ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్‌ను ప్రొఫెసర్ ఎస్వీఎస్ నాగేశ్వరరావు, ప్రొఫెసర్ శ్రీనాథ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీటీడబ్ల్యూఏ అధ్యక్షుడు డాక్టర్ గోపాల్‌రెడ్డి, ఓయూ ప్రొఫెసర్ ఎం.ప్రసాద్, డాక్టర్ జి.ఉపేందర్, డాక్టర్ ఎన్.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
