- ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
చేవెళ్ల, వెలుగు: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి మున్సిపాలిటీల్లో డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి భీమ్ భరత్‌తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
చేవెళ్ల నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలను గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీబీ మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీశ్, సీనియర్ నేత మహమ్మద్ ఫయ్యిమ్, మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పెంటయ్య గౌడ్ పాల్గొన్నారు.
