హైదరాబాద్‎లో భారీ వర్షం.. డ్రైనేజీలో పడి వ్యక్తి గల్లంతు..

హైదరాబాద్‎లో భారీ వర్షం.. డ్రైనేజీలో పడి వ్యక్తి గల్లంతు..

హైదరాబాద్‎లో మరోసారి వాన బీభత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం భారీ వర్షం పడటంతో హైదరాబాద్ మణికొండలో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. గోల్డెన్ టెంపుల్ దగ్గర రోడ్డు దాటుతున్న వ్యక్తి డ్రైనేజ్ లైన్ గుంతలో పడ్డాడు. గుంత ఉందని చెబుతున్నా కూడా వర్షం శబ్దంతో అతడికి వినపడలేదు. వర్షపు నీళ్లలో నడుచుకుంటూ వెళ్తూ.. డ్రైనేజీ కాలువలో పడ్డాడు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. డ్రైనేజీ పైపు లైన్ల కోసం తవ్విన గుంతలో పడిపోయాడు. GHMC, DRF సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని.. గల్లంతైన వ్యక్తి కోసం వెతుకుతున్నారు. మున్సిపల్  అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి గల్లంతయ్యాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కాగా.. నిన్నటి వర్షానికి మణికొండలో అత్యధికంగా 10.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షానికి మణికొండలో ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అపార్ట్‎మెంట్ సెల్లార్లు వరద నీటితో నిండిపోయాయి. దీంతో మోటర్లు పెట్టి నీటిని తోడేస్తున్నారు. వర్షం పడ్డ ప్రతిసారి ఇదే పరిస్థితి ఉందంటున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణికొండ మెయిన్ రోడ్డులో ఉన్న శ్రీనిధి అపార్ట్‎మెంట్ సెల్లార్‎లోకి వరద నీరు చేరడంతో అపార్ట్‎మెంట్ వాసులు వాటర్‎ను తోడేస్తున్నారు. వర్షం పడితే చాలు వేల రూపాయలు ఖర్చు చేసి సెల్లార్‎ను క్లీన్ చేయాల్సి వస్తుందంటున్నారు.

For More News..

సిటీలో 700 బస్సులు కట్

జిరాక్స్‌‌‌‌ పేరిట దోపిడీ.. ప్రతి నెలా రూ. లక్షకు పైగా బిల్లు