హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం వరకు ఎండలు బెంబేలెత్తించగా..  ఏప్రిల్ 20వ తేదీ శనివారం ఒక్కసారిగా వాతవరణం చల్లబడి భారీ వర్షం కురుస్తోంది.

నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి, సనత్ నగర్, ఎర్రగడ్డ, చింతల్,  అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట్  సికింద్రాబాద్, నాంపల్లి, చిక్కడపల్లి , నారాయణగూడ , హిమాయత్ నగర్,  దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్, కొత్త పేట, మలక్ పేట, మాదన్న పేట, సైదాబాద్, ఐఎస్ సదన్, చాదర్ ఘాట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, తుర్కయంజాల్, హయత్ నగర్, ఉప్పల్, హబ్సిగూడ, నాచారాం, తార్నాక, ఘట్ కేసర్ తోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సిటీ శివారులోనూ వర్షం దంచి కొడుతుంది. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట్ గండిపేట్ హిమాయత్ సాగర్,  రాజేంద్రనగర్ తదితర ప్రాంతాలలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది.

రాష్ట్రంలోని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే రంగారెడ్డి, మేడ్చల్, జగిత్యాల్, సిరిసిల్ల, ఉమ్మడి మెదక్ జిల్లా, కామారెడ్డి, ఆదిలాబాద్ వంటి పలు జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. మరికొన్ని జిల్లాల్లో అర్థరాత్రి నుంచే వర్షం పడుతోంది. అకాల వర్షాలతో పలు చోట్ల వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.