హైదరాబాద్కు ఎల్లో అలర్ట్..మరో మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్కు ఎల్లో అలర్ట్..మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణకు మరో  రెండు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.  ఆదిలాబాద్,హైదరాబాద్,  కొత్తగూడెం,జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్,  మెదక్, నల్గొండ,  భువనగిరి జిల్లాలో  తేలికపాటి వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు ఈ జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం  ఉందని తెలిపింది.

అలాగే జనగామ, కామారెడ్డి, ఖమ్మం, మల్కాజ్ గిరి ,ములుగు, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో మోస్తారు వర్షాలు పడతాయని  ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు  గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం  ఉందని తెలిపింది.

హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది.   ఈరోజుతో పాటు సెప్టెంబర్ 29న  నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం  ఉందని వెల్లడించింది.  కాసేపట్లో  హైదరాబాద్లో  భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.  నగరంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది