రాష్ట్రంలో 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

రాష్ట్రంలో 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు.. కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోడైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇక మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పెరిగింది. గోదావరి, కృష్ణా ప్రాజెక్టులకు భారీగా ఇన్ ఫ్లో వస్తుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 20గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు శ్రీశైలం జలాశయానికి 2లక్షల 30వేల క్యూసెక్కలు ఇన్ ఫ్లో వస్తుంవగా.. 10గేట్లు ఎత్తి.. 3లక్షల 32వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి ప్రాజెక్టులైన SRSP, ఎల్లంపల్లి, కాశేశ్వరం ఎత్తిపోతలలోని మూడు బ్యారేజీలకు ఇన్ ఫ్లో కొనసాగుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ఇచ్చింది IMD. 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాల్లో జోరు వర్షాలతో వాగులు పొంగుతున్నాయి. పలు చోట్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. వరద ఆధారంగా కృష్ణా ప్రాజెక్టుల గేట్లు ఆపరేట్ చేస్తున్నారు.