రాత్రంతా దంచికొట్టిన వాన: మరో మూడ్రోజులు భారీ వర్షాలు

రాత్రంతా దంచికొట్టిన వాన: మరో మూడ్రోజులు భారీ వర్షాలు

గురువారం రాత్రి హైదరాబాద్​ను వాన ముంచెత్తింది. రెండు గంటల పాటు కురిసిన భారీ వ‌‌ర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జ‌‌ల‌‌మ‌‌యమయ్యాయి. పలు కాలనీలు నీటమునిగాయి. మ్యాన్‌‌ హోల్స్​ పొంగిపొర్లాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్​ జామ్​ అయింది. ప‌‌లు చోట్ల విద్యుత్ స‌‌ర‌‌ఫ‌‌రాను నిలిపివేశారు. జూబ్లీహిల్స్‌‌లో 9.8 సెం.మీ., ఖైరతాబాద్​లో  6.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 

హైదరాబాద్, వెలుగు: రానున్న మూడ్రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావారణ శాఖ తెలిపింది. శనివారం అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడవచ్చని అంచనావేసింది. గురువారం రాష్ట్రంలో హైదరాబాద్​తో సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాలోని లోకరి(కే)లో అత్యధికంగా 77.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్నూర్​లో 69 మిల్లీమీటర్లు, మేడ్చల్ జిల్లాలోని బాలానగర్​లో 68.8 మిల్లీమీటర్లు, హైదరాబాద్​జిల్లాలోని ఎంసీఆర్ హెచ్​ఆర్డీ ఐటీ క్యాంపస్​లో 66.8 మిల్లీమీటర్లు, యూసుఫ్ గూడ, కృష్ణానగర్​లో 64 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు 
అధికారులు తెలిపారు.