రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

రాష్ట్రంలో మరో మూడు రోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ, రేపు ఉరుములతో వర్షాలు కురిసే చాన్స్ ఉందన్నారు అధికారులు. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ , పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ అర్భన్ , జనగామ, సిద్దిపేట, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురస్తాయని అలర్ట్ చేసింది ఐయండి. ఉమ్మడి ఆదిలాబాద్ , ఖమ్మం, నల్గొండ, మహాబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల అవర్తనం, షియర్ జోన్ ప్రభావమే భారీ వర్షాలకు కారణమంటున్నారు అధికారులు.