పండక్కి ఊర్లకు పోతున్న పబ్లిక్..ORR పై భారీగా ట్రాఫిక్ జామ్

పండక్కి ఊర్లకు పోతున్న పబ్లిక్..ORR పై భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ సిటిలో భారీవర్షాలకు ట్రాఫిక్​ కష్టాలు మరింత తీవ్రం అయ్యాయి. గ్రేటర్​పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్​ జామ్​ అయ్యింది.. వరదలు  ఓ వైపు, మరోవైపు దసరాపండక్కీ ఊర్లకు వెళ్లేందుకు ఒక్కసారిగా జనం బయల్దేరడంతో సిటీ పరిధిలోని ORR ఎగ్జిట్ నంబర్ 4 నుంచి మల్లంపేట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్​ జామ్ అయ్యింది. 

భారీ సంఖ్యలో వాహనాలు రావడంతో టోల్​గేట్లన్నీ ఫుల్​ అయ్యాయి. రెండు గంటలుగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు ఉప్పల్​ పరిధిలో భారీగాట్రాఫిక్​ జామ్​ అయ్యింది.   

మరోవైపు నార్సింగి సర్వీస్ రోడ్డుపై వరద నీరు పొంగి పొర్లుతుండటంతో.. నార్సింగి ఓఆర్ఆర్, సర్వీస్ రోడ్డుపై రాకపోకలు బంద్ అయ్యాయి. జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్ సాగర్కు రికార్డ్ స్థాయిలో వరద రావడంతో గేట్లు ఓపెన్ చేశారు. ఈ కారణంగా నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ జలమయమైపోయింది.

హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరడంతో గేట్లను ఎత్తి  జలమండలి అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ టోల్ గేట్ 18 దగ్గర వాహనాల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. ఈ రోడ్డు మార్గంలో వాహనాలను, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు రాకుండా పోలీసులు, హైడ్రా ప్రత్యేక చర్యలు తీసుకోవడం గమనార్హం. గండిపేట జలాశయం నుంచి మొత్తం 15 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి వరద నీరును దిగువకు విడుదల చేశారు.