
హైదరాబాద్ లో ఉన్నట్టుంది ఒక్కసారిగా వాతావరణం మారింది. మంగళవారం (జూలై 22) మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి..సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సిటీ మొత్త మేఘలు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రానికి హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మరోనాలుగు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది.
మంగళవారం(జూలై 22) సాయంత్రం జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్ లలో భారీ వర్షం కురిసింది. దిల్ సుఖ్ నగర్, చైతన్యపురింలో మోస్తరు వాన కురిసింది. కిషన్ పురా, హైదర్ కోట్, నార్సింగ్ ప్రాంతాల్లో కూడా వర్ష కురిసింది.
ఎల్బీ నగర్ లో వాన దంచికొట్టింది. మరోవైపు శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ లలో జోరువాన కొట్టింది. రాజేంద్ర నగర్, అత్తాపూర్, బండ్లగూడలో మోస్తరు వానపడింది.నాంపల్లి,మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ ఏరియాల్లో కూడా వాన పడింది. మరోవైపు GHMC సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏరియాల్లో భారీ వర్షాలకు కురుస్తాయని ఐఎండీ అలర్ట్ చేసింది.
మరో గంటలో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. లోతట్ట ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.