భారీ వర్షాలు.. లీకవుతున్న రామప్ప టెంపుల్..

భారీ వర్షాలు.. లీకవుతున్న రామప్ప టెంపుల్..

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెరువులు, కుంటలు నిండాయి.  ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఏజెన్సీ ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది.

 దీంతో రామప్ప దేవాలయంలో పైకప్పు నుంచి వర్షపు నీరు కురుస్తోంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలోని పైకప్పులో గ్యాప్స్ ఏర్పడటంతో వాన నీళ్లు రాతి స్తంభాల నుంచి కక్షాసన ప్రదేశంలోని చేరుతున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు అధికారులు.

  నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీరాంసాగర్ లోకి వరద ప్రవాహం పెరిగింది. ఇన్ ఫ్లో 20వేల 23క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 518 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.5TMCలు ఉండగా ప్రస్తుతానికి 20.51TMCలకు చేరింది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 42.53TMCల నీటిమట్టానికి వరద నీరు చేరింది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉదృతి క్రమంగా పెరుగుతోంది.  గోదావరి నీటి మట్టం 47అడుగులకు చేరింది.  మరొక అడుగు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక ఉండటంతో.. లోతట్టు ప్రాంతాల్లోని  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు.గోదావరి స్నానాల ఘాట్లు, కళ్యాణ కట్ట ప్రాంతం గోదావరి వరద నీటిలో మునిగిపోయాయి. ఇప్పటికే భక్తులను, ప్రజలను కరకట్టమీదకు, బ్రిడ్జి మీదకు అనుమతించడం లేదు. భద్రాచలంలో గోదావరి మట్టంపై మరిన్ని డీటేయిల్స్ ఖదీర్ అందిస్తారు.