ఇయ్యాల కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు

ఇయ్యాల కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌‌‌‌‌‌‌‌, ములుగు, వరంగల్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌ అర్బన్‌‌‌‌‌‌‌‌, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. రాష్ట్రంలోని కొన్నిచోట్ల సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని మంగళవారిపేటలో 7 సెం.మీ., మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌లోని నెల్లికుదురులో 5.2, కామారెడ్డిలోని బిర్కూరు, రాజన్న సిరిసిల్లలోని నిజాంబాద్‌‌‌‌‌‌‌‌లో 4.4, ములుగులోని వజీడ్‌‌‌‌‌‌‌‌లో 4.2 చొప్పున వర్షపాతం రికార్డయ్యింది.