రాష్ట్రాన్ని తాకిన ‘తౌక్టే’ తుఫాన్ ప్రభావం

రాష్ట్రాన్ని తాకిన ‘తౌక్టే’ తుఫాన్ ప్రభావం

తౌక్టే తుఫాన్  ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. శనివారం, ఆదివారం ఉదయం చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల  ఆవర్తనం  కొనసాగుతోంది.  దీని ప్రభావంతో  ఉరుములు మెరుపులతో  వర్షం పడే చాన్సుందని  వాతావరణ శాఖ చెప్పింది.  గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల  వేగంతో ఈదురు గాలులు  వీస్తాయని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో పశ్చిమ, దక్షిణ, మధ్య, నైరుతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే  అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

కాగా.. తుఫాన్ వల్ల సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గ్రేటర్ ఏరియా మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. నగరంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం పడుతుంది. హైదరాబాద్‌తో పాటు, రంగారెడ్డి, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో భారీగా వర్షం పడుతోంది. వర్షంతో జిల్లాల్లో చాలా చోట్ల మార్కెట్ యార్డుల్లో అమ్మడానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. దాంతో  రైతులు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు.