రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌ లో వచ్చే ఐదు రోజుల పాటు వాతావరణం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

తెలంగాణలో 2023 జులై 01, 02న  వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. 2023 జులై 4, 5 మంగళ, బుధవారాల్లో తెలంగాణలోని కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.