తెలంగాణలో మళ్లీ వానలే వానలు.. సెస్టెంబర్ 14, 15 తేదీల్లో భారీ వర్షాలు

తెలంగాణలో మళ్లీ వానలే వానలు.. సెస్టెంబర్ 14, 15 తేదీల్లో భారీ  వర్షాలు

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. సెస్టెంబర్ 14, 15 తేదీల్లో రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. సెస్టెంబర్ 14 వానలు దంచికొట్టనున్న నేపథ్యంలో తెలంగాణలోని 13 జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఈ కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. 

నగరానికి ఎల్లో అలర్ట్..

హైదరాబాద్ లో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్,  మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్సాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

రాగల మూడు రోజులు(సెప్టెంబర్ 15, 16, 17) తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలలో సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.