రానున్న 4 రోజులు భారీ వర్షాలు

రానున్న 4 రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజులు.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌‌ ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్‌‌,​ ఆసిఫాబాద్‌‌, మంచిర్యాల, నిర్మల్‌‌, నిజామాబాద్‌‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌‌, యాదాద్రి, మల్కాజిగిరి, మహబూబ్‌‌నగర్‌‌, నాగర్‌‌ కర్నూల్‌‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నిజామాబాద్​లోని జక్రాన్‌‌పల్లిలో 7, మదనపల్లెలో 5.5, గద్వాలలోని ధరూర్​లో 5, నల్గొండలోని కనగల్‌‌లో 4, సంగారెడ్డిలోని రాయికోడ్‌‌లో 3.9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయ్యింది.