రాష్ట్రంలో రాగల మూడు గంటల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలో రాగల మూడు గంటల్లో భారీ వర్షాలు

రాగల మూడు గంటల్లో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతవరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మెదక్ ,కామారెడ్డి, సిద్దిపేట్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ ,మేడ్చల్, వికారాబాద్ ,నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, కామారెడ్డి, సిరిసిల్ల, గద్వాల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో  భారీ వర్షాలు  కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. 

హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, పంజాగుట్ట, హైటెక్ సిటీ, యూసఫ్ గూడ, షేక్ పేట్, గచ్చిబౌలి, ఆర్ సిపురం, రాజేంద్రనగర్, బండ్లగూడ, గొల్కొండ, నార్సింగి, పుప్పాలగూడ, మైలార్ దేవుల పల్లి, మణికొండ, గండిపేట, షాద్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై వరద నీరు చేరింది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.