నిజామాబాద్‌ జిల్లా ఎగువన భారీ వర్షాలు

నిజామాబాద్‌ జిల్లా ఎగువన భారీ వర్షాలు

కొద్ది రోజులుగా నిజామాబాద్‌ జిల్లా ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో 18 గేట్లను ఎత్తిన అధికారులు.. 77వేల 880 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం వేయి 91 అడుగులు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 1,090 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నుండి దిగువకు నీరు విడుదల చేయడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. అవసరం అయితే సురక్షిత ప్రాంతాలకు తరలి వెల్లాలని సూచించారు.