
నైరుతి రుతుపవనాల ప్రభావం రాష్ట్రంలో మొదలైంది. పెద్దపల్లి, భూపాలపల్లి, జనగాం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇవాళ భారీవర్షాలు పడ్డాయి. పెద్దపల్లి జిల్లా భోజన్నపేట్ లో అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనగాం జిల్లా కునూరులో 12.1సెంటీమీటర్ల వర్షం రికార్డైంది.
రాష్ట్రంలో ఇవాళ ఉదయం 8.30 నుంచి.. రాత్రి 8 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ వివరాలు ఇలాఉన్నాయి.