తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు.. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్​

తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు..  20 జిల్లాలకు ఎల్లో అలర్ట్​
  •  20 జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వానలు పడతాయని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో పది జిల్లాలు, గురు, శుక్రవారాల్లో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇచ్చింది. 

మహబూబాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

 చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారానికి  ఎల్లో అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జారీ చేసింది.