4 రోజుల పాటు వర్షాలు కురుస్తయ్

4 రోజుల పాటు వర్షాలు కురుస్తయ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని చెప్పింది. బుధవారం (3న) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో, గురువారం (4న) కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. హైదరాబాద్‌‌లోనూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 12.5 సెంటీమీటర్లు, భువనగిరి జిల్లా తూప్రాన్పేట్‌‌లో 8.3 సెం.మీ. వర్షం కురిసింది