ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు

ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు

నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ జంటనగరాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జనం ఇళ్లలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రాష్ట్రం మొత్తం ఆకాశం మబ్బుపట్టింది. జిల్లాల్లో అయితే వర్షాలు దంచికొడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సూర్యాపేట, జగిత్యాల, వరంగల్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీళ్లు చేరాయి. నిర్మల్ జిల్లా ముథోల్ లో 9గంటల వ్యవధిలో 20.3 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. ఇవాళ, రేపు కూడా అతి భారీ వర్షాలు పడుతాయని అలర్ట్  ఇచ్చింది వాతావరణశాఖ.