
ముంబై: దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఆదివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలకు భారీ నుండి అతి భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబై నగరం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలతో నగరంలో లోతట్టు ప్రాంతాలతోపాటు రోడ్లు, వీధులన్నీ జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోకల్ ట్రైన్స్ నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యవత్మాల్ జిల్లాలోని మహాగావ్ ప్రాంతంలో వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రజలను కాపాడేందుకు భారత వైమానిక దళం యవత్మాల్‌లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వరదల్లో చిక్కుకున్న 110 మందిని రక్షించేందుకు వైమానిక దళానికి చెందిన ఎంఐ 17 వీ5 హెలికాప్టర్ లో నాగ్‌పూర్ నుంచి మహాగావ్‌కు తరలించింది.
ముంబైలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎల్లో అలెక్ట్ జారీ
ముంబైలో గత రాత్రి కూడా భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం ముంబై నగరానికి పసుపు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పాల్ఘర్ జిల్లాలో రెడ్ అలెర్ట్ , ముంబై, థానే, రాయ్ ఘడ్, రత్నగిరి ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.