గంటకు 40 కి.మి వేగంతో గాలులు.. మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు

గంటకు 40 కి.మి వేగంతో గాలులు.. మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.భారీ నుంచి అతి భారీవర్షాలు నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్స్ కొనసాగుతున్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో భారీ , అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

 

 

 ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని  ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30- 40 కి.మీ)తో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.