6వేల మంది పోలీసులతో భద్రత..

6వేల మంది పోలీసులతో భద్రత..
  • వెయ్యి సీసీటీవీ కెమెరాలతో నిఘా.. వీవీఐపీలకు మూడంచెల సెక్యూరిటీ
  • డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ.. కంట్రోల్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ ద్వారా మానిటరింగ్‌‌‌‌‌‌‌‌
  • డెలిగేట్లకు 8 ఫైవ్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటళ్లలో బస.. డీఎస్పీల స్థాయి అధికారికి బాధ్యతలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమిట్​కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌‌‌‌‌‌‌‌, ట్రాఫిక్ పోలీసులు సహా దాదాపు 6 వేల మందితో బందోబస్తు నిర్వహించనున్నారు. సమిట్ జరిగే ప్రాంతంతో పాటు చుట్టుపక్కల వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అసౌకర్యాలకు తావు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

మూడంచెల భద్రత

గ్లోబల్‌‌‌‌‌‌‌‌ సమిట్​లో 8, 9వ తేదీల్లో దాదాపు 3వేల మంది డెలిగేట్లు హాజరుకానున్నారు. ఈ 2 రోజుల బందోబస్తును పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వీవీఐపీలకు మూడంచెల భద్రత, సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన వెయ్యి కెమెరాలను మినీ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ ద్వారా మానిటరింగ్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు. 

మినీ కమాండ్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాచకొండ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లోని సీపీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌, బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని కమాండ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుసంధానం చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాలతో పాటు 4 డ్రోన్లను వినియోగిస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు వీవీఐపీల బందోబస్తును డ్రోన్ల ద్వారా పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

డెలిగేట్ల వెంట పోలీసు అధికారులు

దేశవిదేశాల నుంచి వస్తున్న సీఎంలు, వ్యాపారవేత్తలకు బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌ సహా సిటీలోని 8 ఫైవ్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. డెలిగేట్స్‌‌‌‌‌‌‌‌ బందోబస్తు కోసం డీఎస్పీ, ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. డెలిగేట్స్‌‌‌‌‌‌‌‌ శంషాబాద్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో దిగిన దగ్గర్నుంచి వారిని హోటల్స్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లడంతో పాటు గ్లోబల్‌‌‌‌‌‌‌‌ సమిట్​ పూర్తి అయిన తర్వాత తిరిగి వెళ్లేంత వరకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సుమారు వెయ్యి మంది ట్రాఫిక్ పోలీసులను నియమించారు. ట్రాఫిక్ మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ నిర్వహణ కోసం ట్రాఫిక్ మార్షల్స్ నియమించారు. సాధారణ ప్రజలు, వాహనదారులకు రెండు రోజుల పాటు ఆయా మార్గాల్లో డైవర్షన్లు ఏర్పాటు చేశారు.